Page Loader
Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ
నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ

Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2023
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచులో ముల్తాన్ వేదికగా పాకిస్థాన్-నేపాల్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటుండగా, వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ‌లో భారత్, పాకిస్థాన్, నేపాల్, గ్రూప్-బిలో ఆప్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచులు, మిగతా తొమ్మిది మ్యాచులను శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఇక భారత్ తమ తొలి మ్యాచులో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది.

Details

సెప్టెంబర్ 2 ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్

ముల్తాన్ వేదికగా మ్యాచ్‌కు టోర్నీ ఆరంభ వేడుక జరగనుంది. ఈ వేడుకకు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అష్రాఫ్ వెల్లడించారు. ఇక పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్, పాకిస్తాన్‌ తలపడటం ఇదే మొదటిసారి కానుంది. ఈ టోర్నీలో రెండుసార్లు ఇరుజట్లు తలపడే అవకాశం ఉంది. ఈసారి శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్-2023 టోర్నీలో బరిలోకి దిగుతోంది. గత ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది.