Asian Games 2023: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పీఎస్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం
ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్‌లో శుక్రవారం ఐశ్వరీ తోమర్,స్వప్నిల్ కుసాలే,అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత 50 మీటర్ల రైఫిల్ 3Ps పురుషుల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడలు 2023లో షూటింగ్‌లో భారత్‌కు ఇది 15వ పతకం,7వ స్వర్ణం. భారతదేశం 1769 స్కోరును సాధించి,గత ఏడాది పెరూలో USA మునుపటి రికార్డును ఎనిమిది పాయింట్ల తేడాతో అధిగమించింది. చైనా 1763 స్కోర్‌తో రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1748 స్కోరుతో కాంస్యం సాధించింది. క్వాలిఫికేషన్ దశలో, స్వప్నిల్,ఐశ్వరీ ఇద్దరూ 591 స్కోర్‌లతో అద్భుతంగా రాణించి,కొత్త ఆసియా గేమ్స్ రికార్డును నెలకొల్పారు.