మరో రెండు రోజులలో ఆసియా క్రీడలు.. పతకాల వేటకు 665 మంది సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఈసారి అంచనాలకు మించి భారత్ బరిలోకి దిగుతోంది. 665 మంది ఇందులో తన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
మొత్తంగా 41 క్రీడాంశాల్లో బరిలోకి దిగుతోన్న భారత్ కు పతకాలు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరో రెండ్రోజుల్లో అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభకానున్నాయి. ఇందులో రెజ్లింగ్, టెన్నిస్, బాక్సింగ్, షూటింగ్ ముఖ్యమైనవి.
బాక్సింగ్
ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటికే 9 స్వర్ణాలు, 16 రజతాలు సహా 57 పతకాలు సాధించింది.
దేశానికి అత్యధిక పతకాలు అందించిన ఆటగాళ్ల జాబితాలో బాక్సింగ్ నాలుగో స్థానంలో నిలిచింది.
Details
నిఖత్ జరీన్ పై భారీ అంచనాలు
ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లో స్వర్ణాలు గెలవడంతో మహిళా బాక్సర్లపై చాలా ఆశలున్నాయి.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్(51కేజీల) విభాగంలో స్వర్ణం సాధించడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.
భారత పురుష బాక్సర్లు ప్రపంచ ఛాంపియన్ షిప్స్ చరిత్రలోనే అత్యుత్తమంగా ఈ ఏడాది మూడు పతకాలు సాధించి ఆసియా క్రీడల్లో గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
దీపక్ బోరియా, నిశాంత్ దేవ్, శివ థాపా లకు పతకాలకు సాధించే సత్తా ఉంది.
జట్టులో మరికొందరు ప్రతిభావంతులకు కూడా పతకాలు సాధించే అవకాశం ఉంది.
Details
స్వర్ణంపై గురి పెట్టిన బజ్ రంగ్ పునియా
రెజ్లింగ్
రెజ్లింగ్‌లో ఇప్పటివరకూ 11 స్వర్ణాలు సహా 59 పతకాలు అందాయి. అథ్లెటిక్స్ తర్వాత భారత్ కు అత్యధిక పతకాలు రెజ్లింగ్ లోనే రావడం విశేషం.
ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్ తో కలిసి మొత్తం 18 మంది బలమైన జట్టుతో భారత్ హాంగ్ జౌ క్రీడలకు సిద్ధమైంది.
ఒలింపిక్ కాంస్య పతక విజేత బజ్‌రంగ్ పునియా (ఫ్రీస్టైల్ 65కేజీ) స్వర్ణంపై గురి పెట్టాడు. దీపక్ పునియా (86కేజీ)తో పాటు మరికొందరు పురుష రెజ్లర్లు పతక రేసులో నిలవడం గమనార్హం.
ఇక మహిళల విభాగంలో అంతిమ్ పంగాల్(53 కేజీ) మాన్సీ అహ్లావత్(57కేజీ), సోనమ్ మాలిక్ (62కేజీ)లు పతకాలు వేటకు సిద్ధమయ్యారు.
Details
రోహన్ బోపన్న భారీ ఆశలు
టెన్నిస్
ఆసియా క్రీడల టెన్నిస్ లో ఇప్పటివరకూ 9 స్వర్ణాలు, ఆరు రజతాలు, 17 కాంస్య పతకాలను సాధించింది.
భూపతి, పేస్, సానియా మీర్జా లేకపోయినా తొమ్మిది మందితో కూడిన జట్టు ఆసక్తిని రేపుతోంది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్నేపై భారీ ఆశలు నెలకొన్నాయి.
డబుల్ ర్యాంకింగ్స్ లో ఉన్న టాప్-10లో ఉన్న బోపన్న,ఈసారి బాంబ్రి లేదా సాకేత్ మైనేనితో కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది. మహిళల డబుల్స్‌లో, మిక్స్ డే డబుల్స్‌లో పెద్దగా ఆశలు లేవు.
షూటింగ్
షూటింగ్‌లో ఇప్పటివరకూ ఏషియాడ్ లో 8 స్వర్ణాలు సహా 58 పతకాలను భారత్ సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న యువ షూటర్ రుద్రాంక్ష్ పైనే భారీ అశలు ఉన్నాయి.