Page Loader
Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు
గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు

Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచుల సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగించింది. ఇక 31 ఏళ్ల తర్వాత కేప్‌టౌన్ లో టీమిండియా విజయాన్ని సాధించింది. అయితే రెండో టెస్టు కనీసం రెండు రోజులు కూడా కొనసాగలేదు. ఇక 5 సెషన్ల లోపే ఫలితం వచ్చేయడంతో టెస్టు ఫార్మాట్‌లో అతి తక్కువ సమయం కొనసాగిన మ్యాచుగా చరిత్రకెక్కింది. తొలి రోజే 23 వికెట్లు పడడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వక్తమవుతున్నాయి. భారత్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని విమర్శలు గుప్పించే వారికి రోహిత్ శర్మ (Rohit Sharma) గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Details

పిచ్ రేటింగ్ విషయంలో తటస్థంగా ఉండాలి

ఇండియాలో మొదటి రోజే పిచ్‌పై బంతి తిరగడం మొదలైతే దుమ్మెత్తి పోస్తారని, పిచ్‌పై చాలా పగళ్లు ఉంటాయని కామెంట్లు చేస్తారని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లి ఆడినా తటస్థంగా ఉండటం చాలా కీలమని, ముఖ్యంగా మ్యాచ్ రిఫరీలు ఇందుకు కట్టుబడి ఉండాలని హిట్ మ్యాన్ చెప్పారు. కొంతమంది రిఫరీలు పిచ్‌లను ఎలా రేట్ చేస్తారనేది వారు ఆలోచించుకోవాలని తెలిపారు. ఇక అహ్మదాబాద్‌ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇవ్వడాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నారు. మ్యాచ్ రిఫరీలు ఆతిథ్య దేశాన్ని బట్టి కాకుండా పిచ్‌లను బట్టి రేటింగ్ ఇవ్వాలని చురకలు అంటించాడు.