Page Loader
PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?
నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?

PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ (Pakistan) చెత్త ప్రదర్శనతో విమర్శలను మూటకట్టకుంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు(PCB)కు కొంతమంది రాజీనామా చేశారు. ఏకంగా బాబార్ ఆజాం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వరల్డ్ కప్ ఓటమి ఎఫెక్టు పాక్ క్రికెట్ బోర్డుపై చాలా ప్రభావం చూపించింది. తాజాగా ఐరోపా పర్యటనలో భాగంగా మే 2024లో నెదర్లాండ్స్‌(Netherlands) తో పాక్ మూడు టీ20లను ఆడాల్సి ఉంది. అయితే అనివార్య కారాణాల వల్ల ఈ పర్యటనను వాయిదా వేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్లేయర్ల వర్క్ లోడ్ కారణంగా ఈ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

Details

మళ్లీ రీ షెడ్యూల్ చేస్తామన్న పీసీబీ

ప్లేయర్ల బీజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేశామని, పీసీబీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కెఎన్‌సిబి ఆర్థం చేసుకుందన్నారు. ఈ సిరీస్ మళ్లీ రీ షెడ్యూల్ చేస్తామని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ పాక్, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక టీ20 మ్యాచులు ఒక్కటి కూడా జరగలేదు. గతేడాది సూపర్ లీగ్ లో భాగంగా నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో మూడు వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సిరీస్‌ను పాక్ 3-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలసిందే.