Page Loader
Marcus Stoinis: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకి షాక్.. జట్టుకు మరో ఆల్‌రౌండర్‌ దూరం 
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకి షాక్.. జట్టుకు మరో ఆల్‌రౌండర్‌ దూరం

Marcus Stoinis: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకి షాక్.. జట్టుకు మరో ఆల్‌రౌండర్‌ దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే ప్రముఖ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ జట్టు నుంచి తప్పుకున్నాడు.కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఈ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈవిషయాన్ని జట్టు కోచ్ మెక్‌డొనాల్డ్ స్వయంగా వెల్లడించారు.ఈనేపథ్యంలో సారథిగా ట్రావిస్ హెడ్ లేదా స్టీవ్ స్మిత్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అతను తెలిపాడు. ఆసీస్ బోర్డు ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్టాయినిస్ సభ్యుడిగా ఉన్నప్పటికీ,ఇప్పుడు అతడు ఆడే పరిస్థితి లేదు. అతని స్థానంలో మరో ఆటగాడికి అవకాశం కల్పించనున్నారు.

వివరాలు 

ప్రశ్నార్థకంగా ఆసీస్ జట్టు పరిస్థితి 

ఈ మార్పులను ఫిబ్రవరి 12లోగా పూర్తి చేసే వీలుంది. దీంతో ఆసీస్ క్రికెట్‌లో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసీస్ జట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మార్కస్ స్టాయినిస్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 71 వన్డేలు, 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 2,700 పరుగులు చేసి, 93 వికెట్లు సాధించాడు. స్టాయినిస్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఐపీఎల్‌లో 96 మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఇస్తూ 1,866 పరుగులు చేయడంతో పాటు, 43 వికెట్లు తీసుకున్నాడు.