Page Loader
తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు
తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్

తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2023
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది. దీంతో వరుసగా రెండు నెలలు ( జూన్, జులై) గెలుచుకొని ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుకెక్కింది. మొత్తంగా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కావడం విశేషం. జులై నెలలో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ఐసీసీ అవార్డును ఆమె సొంతం చేసుకుంది. అదే విధంగా జులై నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ సొంతం చేసుకున్నాడు.

Details

యాషెస్ టెస్టులో అద్భుతంగా రాణించిన క్రిస్ వోక్స్

ఈ అవార్డు కోసం నెదర్లాండ్ ఆల్ రౌండర్ బాస్ డిలీడ్, ఇంగ్లండ్ కు చెందిన జాక్ క్రాలే పోటీపడినప్పటికీ వోక్స్ నే ఈ అవార్డు వరించింది. జులై నెలలో జరిగిన యాషెస్ టెస్టులో వోక్స్ అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆప్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నెలలో ఆడిన 3 మ్యాచుల్లో 18.15 సగటుతో 19 వికెట్లను పడగొట్టాడు. జాక్ క్రాలే, బాస్ డిలీడ్ కూడా జులై నెలలో అద్భుతంగా రాణించినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. క్రికెట్‌ అభిమానులు, ఐసీసీ హాల్ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ నుండి సేకరించిన ఓట్ల ఆధారంగా క్రిస్‌వోక్స్ ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం.