డెబ్యూ మ్యాచ్‌లోనే ఆసీస్ యువ బౌలర్ రికార్డు.. 20 బంతుల్లో 3 వికెట్లు.. 1 పరుగు!
ఈ వార్తాకథనం ఏంటి
యూకే వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్‌లో ఆస్ట్రేలియా యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు.
డెబ్యూ మ్యాచులోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓవల్ ఇన్విన్సిబుల్ తరుపున జాన్సన్ బరిలోకి దిగాడు.
మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచులో 20 బంతులేసి ఒక పరుగుఇచ్చి మూడు వికెట్లు తీయడం విశేషం.
ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పొట్టి ఫార్మాట్లో ఏకంగా 19 డాట్స్ వేయడంతో పాటు జోస్ బట్లర్, ఫీల్ సాల్ట్ వంటి బ్యాటర్లను ఔట్ చేశాడు.
మ్యాచ్ విషయానిస్తే హెండ్రెడ్ లీగ్‌లో తొలి మ్యాచులోనే జాన్సన్ రాణించడంతో ఓవల్ జట్టు మంచెస్టర్ ఒరిజినల్స్ పై 94 పరుగుల తేడాతో గెలుపొందింది.
Details
బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడిన జాన్సన్
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ జట్టు 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
హెన్రిచ్ క్లాసేన్ 27 బంతుల్లో 60 పరుగులు బాదడంతో ఓవల్ జట్టు భారీ స్కోరును చేయగలిగింది.
సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన జాన్సన్ 2017లో రెడ్ బ్యాక్స్ తరుపున ఎంట్రీ ఇచ్చాడు.
తర్వాత గాయం భారీన పడటంతో రెండేళ్ల పాటు మ్యాచుకు దూరమయ్యాడు.
ఫిట్నెస్ అనంతరం జాన్సన్ బిగ్ బాష్ లోకి ఎంట్రీ ఇచ్చి, బ్రిస్బేన్ హీట్ తరుపున 9 వికెట్లు తీశాడు.