Page Loader
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్
రికార్డులు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడి ఇంగ్లండ్ పై విజయం సాధించింది. 'బజ్‌బాల్' అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ కు ఆసీస్ చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివరి రోజు మ్యాచ్ చేజారుతున్న తరుణంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆసీస్ కు జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచులో ఆస్ట్రేలియా పలు రికార్డులను బద్దలు కొట్టింది.

Details

ఆస్ట్రేలియా ఆటగాళ్లు సాధించిన రికార్డులివే!

ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్ ను చేధించడం ఇది 15వ సారి, అయితే ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్ ను చేధించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ రికార్డుకెక్కాడు. ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో కమిన్స్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్‌ కమిన్స్‌-నాథన్‌ లియోన్‌ నిలిచారు