Page Loader
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు! 
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు!

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం మరోసారి తన అద్భుత ప్రతిభను చాటింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఏకంగా ఐదుగురు ఆసీస్ బౌలర్లు చోటు దక్కించుకోవడం అభిమానులకు పండుగ మాదిరిగా మారింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో ఆసీస్ బౌలింగ్ దళం ప్రాధాన్యతను, వారి నైపుణ్య స్థాయిని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో స్థానంలో నిలవగా, జోష్ హేజిల్‌వుడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ అరంగేట్రం నుంచి తనదైన స్పష్టతను చూపిస్తున్న స్కాట్ బోలాండ్ 6వ ర్యాంకులో నిలిచాడు. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ 8వ స్థానంలో ఉండగా, మిచెల్ స్టార్క్ 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

Details

రెండో స్థానంలో జస్పిత్ బుమ్రా

ఇతర జట్లతో పోలిస్తే టాప్ 10లో సగం స్థానాలను ఆక్రమించడం ఓ జట్టు బౌలింగ్ డెఫ్త్‌కు నిదర్శనం. వేగ, స్పిన్, యాంగిల్, లెంగ్త్ పరంగా విభిన్న నైపుణ్యాలతో కూడిన ఈఐదుగురు బౌలర్లు ఏ పిచ్‌, ఏ పరిస్థితుల్లోనైనా వికెట్లు తీసే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 3-0తో గెలవగా, చివరి టెస్టులో విండీస్‌ను 204 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేయడం ఆసీస్ బౌలింగ్‌ ప్రభావాన్ని మరోసారి ఋజువు చేసింది. ఇక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 2 స్థానాల్లో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (నెంబర్ 1), దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా (నెంబర్ 2) నిలిచారు.