AUS vs NED: వరల్డ్ కప్ చరిత్రలో భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పసికూన నెదర్లాండ్స్ ఫై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెరుపు సెంచరీ చేయడం, డేవిడ్ వార్నర్ (104) కూడా శతక్కొట్టడంతో పాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) మెరుగ్గా రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనకు నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులు చేసి ఆలౌటైంది.
దారుణ రికార్డును మూటకట్టుకున్న బాస్ డి లీడ్
ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు వికెట్లతో చెలరేగగా, మిచెల్ మార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక స్టార్క్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బాస్ డి లీడ్ (115) బాస్ డి లీడ్ దారుణ రికార్డును మూటకట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో మొదట పాకిస్థాన్ సెంచరీ చేసిన వార్నర్, నెదర్లాండ్ మ్యాచులోనూ శతకంతో విజృంభించాడు