Page Loader
David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 
David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 

వ్రాసిన వారు Stalin
Jan 01, 2024
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ సోమవారం సంచలన ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరి 3 నుంచి సిడ్నీలో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు ఆడబోతున్నాడు. అయితే వార్నర్ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన తర్వాత.. వన్డేల్లో రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు వార్నర్ చెప్పాడు. తన కెరీర్‌లో వార్నర్ ఆస్ట్రేలియాకు అనేక చిరస్మరణీయ విజయాలను అందించాడు. వార్నర్ వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన 6వ ఆటగాడిగా ఉన్నాడు. వన్డేల్లో వార్నర్ 161 మ్యాచ్‌ల్లో 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. 97.26 స్ట్రైక్ రేట్‌తో 22 సెంచరీలు చేశాడు.

ఆస్ట్రేలియా

వన్డేల్లో ఆస్ట్రేలియాకు మూడో అత్యధిక సగటు వార్నర్‌దే

వన్డేల్లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్లలో వార్నర్ సగటు 45.30. సగటులో మైఖేల్ బెవన్(53.58), మైఖేల్ హస్సీ(48.15) తర్వాత వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. వార్నర్ వన్డేల్లో 4,000, 5,000, 6,000, 7,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో 11 గేమ్‌లలో 48.63సగటుతో 535 పరుగులతో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వార్నర్ తన WC కెరీర్‌ను 56.55 సగటుతో 1,527 పరుగులతో ముగించాడు. 2016లో వార్నర్ ఏడు వన్డే సెంచరీలు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.