T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్..?
వెస్టిండీస్,అమెరికాలో జరిగే టి20 వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత మార్ష్ తాత్కాలిక కెప్టెన్‌గా ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించాడు. అంతేకాకుండా, మార్ష్‌కు టీ20 పగ్గాలు ఇవ్వాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)పై ప్రెషర్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
మార్ష్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌లు
ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కెప్టెన్సీ భారం లేకుండా టీ20 క్రికెట్ ఆడడాన్ని తాను ఆస్వాదించానని చెప్పాడు. గత 12 నెలల్లో మార్ష్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లపై ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లను గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ 2024కి ముందు జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. వన్డే ప్రపంచకప్ అందించిన ప్యాట్ కమిన్స్‌పై సీఏ వేటు వేస్తుందా లేక కొనసాగిస్తుందా వేచి చూడాలి. కెరీర్‌లో 54 టీ20లు ఆడిన మార్ష్ 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానుంది.