AUS vs NED: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ ఎంట్రీ
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మార్క్ స్టోయినిస్ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో కామెరూన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక నెదర్లాండ్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ పై గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్ ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా కష్టమే.. ఆ జట్టులో అకార్మాన్, ఎడ్వర్డ్స్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లొగాన్‌వాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇరు జట్లలోని సభ్యులు వీరే
నెదర్లాండ్స్ జట్టు విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా