Page Loader
సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌ చేరుకున్న రుబ్లెవ్

సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదోవ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సత్తా చాటాడు. పురుషుల సింగల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. తొమ్మిదో-సీడ్ హోల్గర్ రూన్‌పై 6-3, 3-6, 6-3, 4-6, 7-6(9)తో రుబ్లెవ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. రుబ్లెవ్ తన కెరీర్‌లో ఏడవ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. 12 సార్లు ATP టూర్ సింగిల్స్ టైటిల్‌ లిస్ట్ అయిన రుబ్లెవ్ ఈ మ్యాచ్‌లో 168 పాయింట్లను సేకరించాడు. మొదటి, రెండో సర్వేలో 73, 51 శాతాన్ని విజయాన్ని నమోదు చేశాడు. రుబ్లెవ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 16-6తో రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా, గ్రాండ్‌స్లామ్‌లలో అతనికి 46-20 రికార్డు ఉంది.

రుబ్లేవ్

రుబ్లేవ్ సాధించిన రికార్డులివే..

రుబ్లేవ్ స్లామ్‌లలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇదో ఏడోసారి. ఆయన స్లామ్ లలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇదో ఏడోసారి రుబ్లెవ్ రూన్‌పై తన తొలి ATP టూర్ విజయాన్ని నమోదు చేసి, రికార్డును 1-1తో సమం చేశాడు. రుబ్లెవ్ 2023లో పురుషుల సింగిల్స్‌లో 4-2 రికార్డుకు చేరుకొని సత్తా చాటాడు. అతను చివరిసారిగా 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దక్షిణ కొరియాకు చెందిన సూన్ వూ క్వాన్‌పై ఆడిన విషయం తెలిసిందే.