IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్‌గా అక్షర్ పటేల్?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు, స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తమ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే విషయంలో పంత్‌ను పక్కన పెట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అతడి స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని సీజన్లుగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న అక్షర్, ప్రతీ సీజన్‌లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో కూడా అక్షర్ పటేల్ అదరగొట్టాడు.
వివరాలు
కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
అతడు 14మ్యాచ్‌లు ఆడి 11వికెట్లతో పాటు 235పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలోనే అతడిని తమ కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్‌గా కొనసాగించాలనుకుంటోంది. అతడిపై రూ.18 కోట్లు ఖర్చు చేసి రిటైన్ చేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని సమాచారం.
రిషబ్,కుల్దీప్ యాదవ్,అక్షర్ పటేల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది,భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
పంత్‌ను ఢిల్లీ టాప్ రిటెన్షన్‌గా కొనసాగించనుంది.తద్వారా అతడి కెప్టెన్సీ ఒత్తిడిని తొలగించి,పూర్తి దృష్టిని తన ఆటపై కేంద్రీకరించేందుకు అవకాశం కల్పిస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడిస్తున్నాయి.