
Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
14 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్ ప్రతిభతో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆటలో పాల్గొన్న ఆయుష్,రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైభవ్ తమ ప్రతిభతో రాణించారు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని సాధించి వైభవ్ చక్కటి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
బిహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అతను ఇప్పటికే ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు,ఒక లిస్ట్-ఎ మ్యాచ్ కూడా ఆడాడు.
వివరాలు
జూన్ 24న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన
ఇక 17 ఏళ్ల ఆయుష్ మాత్రే, 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ముంబయికి చెందిన వికెట్‌కీపర్, బ్యాటర్ అభిజ్ఞాన్ కుందును ఈ అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించారు.
జూన్ 24న ప్రారంభమయ్యే ఈ ఇంగ్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు ఒక 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్‌తో పాటు, ఐదు యూత్ వన్డే మ్యాచ్‌లు, రెండు బహుళ రోజుల మ్యాచ్‌లు ఆడనుంది.
భారత్ అండర్-19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిగ్ చవ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్‌కెప్టెన్),హర్‌వంశ్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్,ఖిలాన్ పటేల్,హెనిల్ పటేల్,యుధజిత్ గుహ,ప్రణవ్ రాఘవేంద్ర,మహ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా,అన్మోల్‌జీత్ సింగ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే
AYUSH MHATRE to lead india’s U19 Squad 😍😍 pic.twitter.com/nt4103VVNp
— Dharsh (@DharshOfficial) May 22, 2025