Babar Azam: బాబార్ అజామ్ భయపడ్డాడు.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది. ఒక దశలో 155/2తో పటిష్టంగా ఉన్న పాక్, 191 పరుగులకే ఆలౌట్ అయింది. బాబర్ 50 (58), మహ్మద్ రిజ్వాన్ 49 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) ఆట తీరుపై పాక్ మాజీ కెప్టెన్ మెయిన్ ఖాన్ స్పందించాడు. కెప్టెన్ గా బాబర్ క్రీజులో ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేదని, మ్యాచులో కీలక సమయంలో పరుగులు రాబట్టలేదని, ఈ మ్యాచులో అతను భయపడ్డానని తెలిపాడు.
బాబార్ ఆజం కెప్టెన్సీపై షోయాబ్ మాలిక్ విమర్శలు
వెటరన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) కూడా బాబార్ కెప్టెన్సీ విమర్శలు గుప్పించాడు. బాబార్ టాప్ ర్యాంప్ జట్లపై ప్లాన్ బి, సి వంటి ప్రణాళికలు అమలు చేయలేదన్నారు. పెద్ద జట్లతో ఆడినప్పుడు ప్రణాళికతో ముందుకెళ్లాలని, కానీ బాబర్ కప్టెన్సీ చెత్తగా ఉందని మాలిక్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ మూడు మ్యాచులాడిన పాకిస్థాన్, రెండు మ్యాచుల్లో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.