Page Loader
హైదారాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్ కప్ మ్యాచ్!
రోహిత్ శర్మ, బాబర్ ఆజం

హైదారాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్ కప్ మ్యాచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఆక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెగా టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి బీసీసీఐ పంపినట్లు సమాచారం. టీమిండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచులను ఆడేందుకు 9 వేదికలను ఖరారు చేసిందట. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చైన్నై వేదికగా ఆక్టోబర్ 15న జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఫస్ట్ అహ్మదాబాద్ వేదికగా ఈమ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే భద్రతకారణాల దృష్ట్యా చివరి నిమిషంలో ఐసీసీ నిర్ణయం మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Details

డ్రాప్ట్ షెడ్యూల్ లో  ఉప్పల్ స్టేడియానికి దక్కని స్థానం?

ఫస్ట్ అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే భద్రత కారణాల దృష్ట్యా చివరి నిమిషంలో ఐసీసీ నిర్ణయం మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అహ్మదాబాద్ లో ఆడేందుకు నో చెప్పింది. చెన్నై, ఢిల్లీ, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికగా టీమిండియా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచ కప్ కు బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఒకటి. అయితే ఉప్పల్ లో మాత్రం టీమిండియా జట్టు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ సిద్ధం చేసిన డ్రాప్ట్ షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరు లేనట్లు తెలుస్తోంది.