Page Loader
ముంబై ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం

ముంబై ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కి గట్టి షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచ కప్ కోసం రోహిత్‌శర్మ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. రోహిత్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే రోహిత్ ఆడనున్నాడు. దీనికి ముంబై ఇండియన్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్!

కెప్టెన్‌గా ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ ఏడు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 143 మ్యాచ్‌ల్లో ముంబైకి 79 విజయాలను అందించాడు. కెప్టెన్సీలో 56.64 విజయ శాతాన్ని రోహిత్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో వరుస డకౌట్‌లతో నిరాశపరిచన సూర్యకుమార్ యాదవ్ రోహిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను అందుకోనున్నాడు. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. గత సీజన్లో ఎనిమిది మ్యాచ్ లు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో ముంబై చివరి స్థానంలో నిలచింది.