IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఘనవిజయం
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 50 పరుగులతో చెలరేగాడు. డుప్లిసెస్(22), లిమ్నార్ (26), మాక్స్ వెల్ (24), అహ్మద్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించారు. దినేష్ కార్తీక్(0) డకౌట్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు.
ఢిల్లీ బౌలర్లలో మార్ష్, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. లలిత్ యాదవ్, అక్షర పటేల్ చెరో ఓ వికెట్ తీశారు.
ఆర్సీబీ
23 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం
లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీషా(0), మిచిల్ మార్స్(0) డకౌట్ తో వెనుతిరిగాడు. కేవలం ఒక పరుగుకే ఢిల్లీ రెండు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక డేవిడ్ వార్నర్ 19 పరుగులు చేసి విజయశంకర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ఢిల్లీ బ్యాటర్లలో మనిష్ పాండే (50) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీ ఔటమిపాలైంది.
బెంగళూరు బౌలర్లలో విజయశంకర్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లతో రాణించారు.
ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులను మాత్రమే చేసింది. దీంతో బెంగళూర్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.