Loading...
Taskin ahmed: ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబోయ్.. గ్రీన్ వికెట్ తర్వాత టాస్కిన్ డ్యాన్స్ వైరల్
ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబోయ్.. గ్రీన్ వికెట్ తర్వాత టాస్కిన్ డ్యాన్స్ వైరల్

Taskin ahmed: ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబోయ్.. గ్రీన్ వికెట్ తర్వాత టాస్కిన్ డ్యాన్స్ వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ అదరగొట్టాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్‌ను పెవిలియన్‌కు పంపిన అనంతరం టాస్కిన్ చేసిన వింత సెలబ్రేషన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నోరు తెరిచి, నాలుక బయటపెట్టి, రెండు చేతులతో విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ అతడు చేసిన సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఈ తొలి టెస్టు మొదటి రోజే ఉత్కంఠగా సాగుతోంది. డార్విన్ పిచ్‌పై మంచి ఊపులో కనిపించిన కామరాన్ గ్రీన్‌ను టాస్కిన్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు.

వివరాలు

ముష్ఫికర్ రహీమ్ అద్భుత క్యాచ్..

ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో టాస్కిన్ వేసిన బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే బంతి సరిగ్గా బ్యాట్‌కు తగలకపోవడంతో గాల్లోకి లేచింది. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

గ్రీన్ ఔటైన వెంటనే టాస్కిన్ తన నాలుక బయటపెట్టి, రెండు చేతులతో విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

మిగతా ఆటగాళ్లంతా రహీమ్ వైపు పరుగెత్తగా.. టాస్కిన్ మాత్రం అక్కడే ఉండి తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.

అతడి సరదా డ్యాన్స్ కెమెరాలో రికార్డు కావడంతో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు

ఆసీస్ జట్టుకు బంగ్లా పేసర్ల షాక్..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్ పేసర్లు ఊహించని షాక్ ఇచ్చారు.

పచ్చికతో ఉన్న పిచ్‌ను, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్, వరుసగా నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.

వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను ఒక్కసారిగా ఒత్తిడిలోకి నెట్టారు.

హసన్ మహమూద్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.

లోకల్ హీరో జేక్ వెదర్‌ఆల్డ్‌ను 23 పరుగుల వద్ద ఔట్ చేసిన హసన్.. ఆ తర్వాతి ఓవర్‌లోనే విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

దీంతో ఆస్ట్రేలియా 52పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ADVERTISEMENT

వివరాలు

2003 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు..

మరోవైపు పేసర్ ఎబాదత్ హుస్సేన్ కూడా తన పదునైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

మార్నస్ లబుషేన్‌ను బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి పెవిలియన్‌కు పంపించాడు.

స్లిప్‌లో ఓ సులువైన క్యాచ్ చేజారకపోయి ఉంటే స్టీవ్ స్మిత్ కూడా త్వరగానే ఔటయ్యేవాడు.

ఇక లంచ్ విరామానికి ముందు టాస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో కామరాన్ గ్రీన్ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడింది.

2003 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్.. మొదటి రోజే ఇలా ఆధిపత్యం ప్రదర్శించడం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

ADVERTISEMENT