BAN Vs PAK : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఏ జట్టులో మార్పులు జరిగాయంటే..
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు 38 వన్డేలు తలపడ్డగా, అందులో పాక్ 33 మ్యాచుల్లో నెగ్గగా, బంగ్లా 5మ్యాచుల్లో గెలుపొందింది. ఈ రెండు జట్లు చివరిసారిగా ఆసియా కప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచులో బంగ్లాదేశ్‌ను పాక్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఛాంపియన్ ట్రోఫీలో వరల్డ్ కప్‌లో తొలి 8 జట్లు ఆడతాయన్న ఐసీసీ ప్రకటన దృష్ట్యా బంగ్లాకు ఈమ్యాచ్ కీలకం కానుంది. మరోవైపు సెమీస్ రేసులో నిలవాలంటే పాక్ ఈ మ్యాచులో తప్పక నెగ్గాల్సి ఉంటుంది.
ఇరు జట్లలోని సభ్యులు
పాకిస్థాన్ జట్టు అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్ బంగ్లాదేశ్ జట్టు లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(c), ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం