Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రికీ పాంటింగ్,జస్టిన్ లాంగర్..క్లారిటీ ఇచ్చిన జే షా
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
కాగా, కొత్త కోచ్ విషయంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లను బీసీసీఐ సంప్రదించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు పుకార్లే అని తేలింది. బోర్డు ఏ ఆస్ట్రేలియా క్రికెటర్‌ను సంప్రదించలేదని బీసీసీఐ సెక్రటరీ జే షా స్పష్టం చేశారు.
ఉద్యోగానికి సరైన అభ్యర్థిని కనుగొనడానికి 'నిర్దిష్ట' ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీసీసీఐ
బీసీసీఐ సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది: జై షా
''భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన ఉన్న వారి కోసం, అంచెలంచెలుగా ఎదిగిన వాళ్లపై దృష్టిసారించాం. టీమిండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మన కోచ్‌కు దేశవాళీ క్రికెట్‌పై లోతైన పరిజ్ఞానం ఉండటం ఎంతో కీలకం.బీసీసీఐ సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది'' అని జై షా అన్నాడు.
జై షా వ్యాఖ్యలను బట్టి భారత మాజీ క్రికెటరే కోచ్ రేసులో ఉన్నాడని స్పష్టమవుతోంది. గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాతో పాటు హర్భజన్ సింగ్ పోటీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
కోచ్ పదవీకాలం
కొత్త కోచ్ పదవీకాలం 3.5 సంవత్సరాలు
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రేసులో గౌతమ్ గంభీర్ పేరు ముందంజలో ఉంది. అయితే గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కావాలంటే కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
ఎందుకంటే బీసీసీఐ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి లాభదాయకమైన రెండు స్థానాలను కలిగి ఉండరాదని స్పష్టంగా ఉంది.
అటువంటి పరిస్థితిలో, గంభీర్ కోల్‌కతా మెంటర్‌షిప్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది.
బీసీసీఐ లేదా ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఏ వ్యక్తి ఏకకాలంలో రెండు పదవులు చేపట్టకూడదు.
ఒక వ్యక్తి జట్టుకు కోచ్‌గా ఉంటే, అతను ఐపిఎల్ ఫ్రాంచైజీకి కోచ్‌గా ఉండలేడని, ఇది ప్రత్యక్ష ప్రయోజనాల వివాదంగా పరిగణించబడుతుందని కూడా స్పష్టంగా ఉంది.
షరతులు
టీమ్ ఇండియా కోచ్ కావడానికి షరతులు
కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 ODI మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా కనీసం 2 సంవత్సరాల పాటు పూర్తి సభ్యుల టెస్ట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా ఉండాలి.
లేదా కనీసం 3 సంవత్సరాల పాటు అసోసియేట్ మెంబర్/ఐపీఎల్ టీమ్ లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ టీమ్/నేషనల్ A టీమ్‌కి హెడ్ కోచ్‌గా ఉండాలి .
లేదా BCCI లెవల్ 3 సర్టిఫికేషన్ సమానమైనది, వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
క్లారిటీ
క్లారిటీ ఇచ్చిన లాంగర్,పాటింగ్
''ఆస్ట్రేలియా జట్టుకు నాలుగేళ్లపాటు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించా. చాలా అలసిపోయా. జాతీయ టీమ్‌ను నడిపించడం తేలికైన విషయం కాదు" అని లాంగర్ తెలిపాడు.
భారత జట్టుకు ప్రధాన కోచ్ కావడానికి ఆసక్తి ఉన్నా.. కానీ, సొంతకారణాల వల్ల బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించాల్సి వచ్చింది. టీమిండియాకి హెడ్ కోచ్ పదవి అంటే ఏడాదికి దాదాపు 10 నుంచి 11నెలలు పనిచేయాలి. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబానికి సమయం ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే టీమిండియా హెడ్ కోచ్ పదవిపై అనాసక్తిని చూపించాను" అని రికి పాంటింగ్ చెప్పారు.