
ENG Vs IND: ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి.
ఈ సిరీస్ కోసం భారత్ సూమారు రెండు నెలల పాటు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
గత 17 ఏళలుగా ఓ టెస్టు సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది.
ఇరు జట్లు చివరిసారిగా 2021లో ఐదు టెస్టుల సిరీస్ మ్యాచులో తలపడ్డాయి. ఇందులో 2-2తో సమానంగా పంచుకున్నాయి.
Details
కెప్టెన్ గా రోహిత్ శర్మ
ఇంగ్లండ్ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
షెడ్యూల్ ఇదే.. తొలి టెస్ట్ - జూన్ 20 నుంచి 24, వేదిక: లీడ్స్
రెండో టెస్ట్ - జులై 2 నుంచి 6, వేదిక: బర్మింగ్‌హామ్
మూడో టెస్ట్ - 10 నుంచి 14, వేదిక: లండన్
నాలుగో టెస్ట్ - జులై 23 నుంచి 27, వేదిక: మాంచెస్టర్,
ఐదో టెస్ట్ - జులై 31 నుంచి ఆగస్ట్ 4, వేదిక: లండన్