LOADING...
BCCI: డ్రీమ్‌11 వైదొలగడంతో కొత్త స్పాన్సర్ అన్వేషణలో  బీసీసీఐ
డ్రీమ్‌11 వైదొలగడంతో కొత్త స్పాన్సర్ అన్వేషణలో బీసీసీఐ

BCCI: డ్రీమ్‌11 వైదొలగడంతో కొత్త స్పాన్సర్ అన్వేషణలో  బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు టైటిల్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌11 (Dream11) అర్ధాంతరంగా ఒప్పందం నుంచి వైదొలగడంతో, బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్‌ కోసం వేట మొదలుపెట్టింది. అయితే రాబోయే ఆసియా కప్‌ ప్రారంభానికి ముందే స్పాన్సర్‌ ఖరారు అవుతుందనే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం తాజాగా డబ్బుతో ముడిపడి ఉన్న అన్ని ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకురావడంతో, డ్రీమ్‌11 ఇకపై భారత జట్టుతో టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ధృవీకరించారు. "మేం వాళ్లతో కొనసాగలేం. కొత్త స్పాన్సర్‌ కోసం అన్వేషిస్తున్నాం. ఆ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Details

ఏడాదికి రూ.358 కోట్లతో ఒప్పందం

భారత జాతీయ జట్లకు స్పాన్సర్‌గా ఏడాదికి రూ.358 కోట్లతో డ్రీమ్‌11 బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందానికి ఇంకా ఏడాది గడువు మిగిలి ఉన్నప్పటికీ, డ్రీమ్‌11 అర్ధాంతరంగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా బీసీసీఐ, ఆ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశమూ లేదు. ఇదిలా ఉండగా, మరో గేమింగ్‌ సంస్థ మై11సర్కిల్‌ (My11Circle) కూడా ఐపీఎల్‌ స్పాన్సర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని సమాచారం. ఈ సంస్థ ఐపీఎల్‌కు సంబంధించి ఐదేళ్ల ఒప్పందం ప్రకారం, ఏడాదికి రూ.125 కోట్లతో స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.