Page Loader
BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ
BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచిన బీసీసీఐ

BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెస్టు క్రికెట్ వైపు ఆటగాళ్లను ఆకర్షించేందుకు మ్యాచ్ ఫీజులను పెంచడంతో పాటు, ప్రోత్సాహక మొత్తాన్ని కూడా పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. అదే సమయంలో, ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని టెస్ట్ సిరీస్‌లు ఆడే ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లతో పాటు అదనపు బోనస్‌లు ఇచ్చేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ నిరాకరించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ

ఐపీఎల్ 2024 తర్వాత టెస్ట్ మ్యాచ్ ఫీజును పెంచనున్న బీసీసీఐ 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కి రూ.15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, T20 ఇంటర్నేషనల్‌కు రూ. 3 లక్షలను బీసీసీఐ ఫీజును అందజేస్తోంది. ఐపీఎల్ 2024 తర్వాత టెస్ట్ మ్యాచ్ ఫీజును బీసీసీఐ పెంచనుంది. అలాగే, మ్యాచ్ ఫీజుతో పాటు ప్రోత్సాహక పథకాన్ని కూడా బీసీసీఐ అమలు చేయవచ్చు. ఇదిలా ఉండగా.. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. విజయం అనంతరం రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో టెస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వని ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టెస్ట్ అత్యంత కష్టతరమైన ఫార్మాట్ అని, టెస్టు క్రికెట్‌పై ఆకలి లేని ఆటగాళ్లకు భోజనం పెడితే ఏం లాభం? అని అన్నారు.