Page Loader
Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ 

Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందుగా భారత జెర్సీలో మార్పులు చేసిన బీసీసీఐ, కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. భారత అభిమానులను ఆకట్టుకునేలా ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు. గత జెర్సీలో భుజం నుంచి చేతుల వరకు కాషాయ రంగు ఉండగా, తాజా డిజైన్‌లో భారత త్రివర్ణ పతాకం ప్రతిబింబించేలా భుజాలపై ప్రత్యేక శైలిలో రంగులను పొందుపరిచారు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక గుర్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఆటగాళ్లలోనే కాదు, అభిమానుల్లోనూ దేశభక్తి భావాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.

వివరాలు 

కొత్త జెర్సీతో రోహిత్ శర్మ ఫొటో లేదు

ఈ కొత్త జెర్సీకి వన్డే జట్టులోని ఆటగాళ్లు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. అనంతరం బీసీసీఐ ఈ ఫొటోలను ఎక్స్‌లో పంచుకుంది. అయితే, ఈ ఫొటోలలో కోహ్లీ సహా ఇతర క్రికెటర్లు కనిపించినప్పటికీ, రోహిత్ శర్మ ఫొటో మాత్రం లేదు.దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత జట్టు, తొలి వన్డేను నాగ్‌పుర్ వేదికగా ఆడనుంది. రెండు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్‌ను ప్రారంభించాయి. 4-1 తేడాతో టీ20 సిరీస్‌ను విజయవంతంగా ముగించిన భారత జట్టు, వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్త జెర్సీ లో ఫోజులిచ్చిన ఆటగాళ్లు