Page Loader
BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి
భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వాకా స్టేడియం వేదికగా ప్రాక్టీస్‌ సెషన్‌ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాక్టీస్‌ను అభిమానులకు అనుమతించలేదు. అంతేకాకుండా, సిబ్బంది కూడా ఫోన్లను తీసుకోలేదని సమాచారం. అయితే భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వర్కౌట్ చేసిన వార్మప్‌ మ్యాచ్‌కు కూడా అభిమానులను అనుమతించకూడదని తెలిపింది. 22న పెర్త్‌లో ఆసీస్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు, భారత్‌-ఎతో జరుగాల్సిన సన్నాహక మ్యాచ్‌ తొలుత రద్దు చేశారు. అయితే తాజాగా ఇంట్రాస్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌ను వాకా వేదికపై శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

Details

ప్రాక్టీస్ కు హజరు కాని విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా

పెర్త్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ వార్మప్ మ్యాచ్‌ భారత్‌ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో పేస్‌ బౌలింగ్‌కు సిద్ధం కావడానికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ప్రాక్టీస్ సెషన్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా హాజరుకాలేదు. ఈ రోజు ఆప్షనల్‌ సెషన్ కావడంతో వారు విశ్రాంతి తీసుకున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌ గడ్డపై అడుగు పెట్టలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం, ఆసీస్‌ పేస్ బౌలర్ల నుంచి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా ఓపెనర్‌గా ఆడే రోహిత్‌కు కొత్త బంతితో మరింత కఠినమైన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని బ్రెట్‌ లీ తెలిపారు.