NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ
    ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ

    BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    11:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ధర్మశాలలో నిర్వహించాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.

    స్టేడియంలో ఉన్న ఫ్లడ్ లైట్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను కొనసాగించటం సాధ్యపడలేదు.

    ఆపై రెండు జట్ల ఆటగాళ్లను వెంటనే సురక్షితంగా వారి హోటళ్లకు తరలించారు.

    భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న డ్రోన్ దాడులు భద్రతపై అనుమానాలు మిగిల్చుతున్న నేపథ్యంలో, ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాకుండా చూసేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టింది.

    ఈ క్రమంలో ఆటగాళ్ల రవాణాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

    వివరాలు 

    మ్యాచ్ రద్దు కావడంతో స్టేడియం ఖాళీ

    "ధర్మశాలలో చిక్కుకున్న ఢిల్లీ, పంజాబ్ జట్ల ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిని సురక్షితంగా తరలించటం మా బాధ్యత. అందుకే ఉనా పట్టణం నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటుచేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు కావడంతో స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నారు. రేపటి పరిస్థితులను బట్టి ఈ సీజన్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ప్రస్తుతానికి ఆటగాళ్ల భద్రతకే ప్రాధాన్యత ఇస్తున్నాం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు మ్యాచ్ నిర్వహించటం అనుచితమని మేము భావించాం," అని ఆయన స్పష్టం చేశారు.

    వివరాలు 

    హిమాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేత 

    ఇదిలా ఉండగా, 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

    అయితే అప్పటికే పంజాబ్, ఢిల్లీ జట్లు ధర్మశాలలోకి చేరుకోవడంతో, గురువారం కఠినమైన భద్రత మధ్య మ్యాచ్ నిర్వహించారు.

    వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా, మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైంది.

    కానీ పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఒక్క బంతి పడగానే ఒక ఫ్లడ్‌లైట్ పని చేయకపోవడంతో మిగిలిన రెండు లైట్లు కూడా ఆగిపోయాయి.

    ఈ బ్లాక్‌అవుట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు 

    #WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ

    — ANI (@ANI) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ బీసీసీఐ
    Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో అమెరికా
    Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్‌ పట్టుకున్ననిఘా వర్గాలు రాజస్థాన్
    Pope Leo: నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌.. వెల్లడించిన వాటికన్  వాటికన్ సిటీ

    బీసీసీఐ

    Rohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం రోహిత్ శర్మ
    Devjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ ఐసీసీ
    IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ  ఐపీఎల్
    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025