Page Loader
2023 ఫ్రెంచ్ ఓపెన్: సెమీఫైనల్‌కి దూసుకెళ్లిన బిట్రిజ్ హద్దాద్ మైయా
సత్తా చాటిన బీట్రిజ్ హద్దాద్ మైయా

2023 ఫ్రెంచ్ ఓపెన్: సెమీఫైనల్‌కి దూసుకెళ్లిన బిట్రిజ్ హద్దాద్ మైయా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచులో ఓన్స్ జబీర్ పై బిట్రిజ్ హద్దాయ్ మైయా గెలుపొందింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో 3-6, 7-6, 6-1తో ఓన్స్ జబీర్‌ను బ్రిటెజ్ హద్దాయ్ మైయా చిత్తు చేసింది. గత కొంతకాలంగా వరుస పరాజయాలను చూసి బ్రిటెజ్ హద్దాయ్ మైయా ఫ్రెంచ్ ఓపెన్ తో సత్తా చాటింది. దీంతో సెమీఫైనల్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది. హద్దాద్ మైయా అడిలైడ్ ఇంటర్నేషనల్ 2లో క్వార్టర్-ఫైనల్, అబుదాబిలో జరిగిన సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మహిళల సింగిల్స్‌లో హడాద్ మైయా 19-10 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉంది. హద్దాద్ మైయా గ్రాండ్‌స్లామ్స్‌లో కెరీర్‌లో తొలిసారి సెమీస్‌కు చేరుకోవడం విశేషం.

Details

రికార్డు సృష్టించిన హద్దాద్ మైయా 

రోలాండ్ గారోస్‌లో ఆమె రికార్డు 6-2గా ఉండగా. ఓవరాల్‌గా స్లామ్స్‌లో 12-11 రికార్డును కలిగి ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. జబీర్ ఎనిమిది ఏస్‌లతో పోలిస్తే హద్దాద్ మైయా నాలుగు ఏస్‌లు సాధించింది. జబీర్ చేసిన నాలుగు తప్పులకు ఆమె మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. హద్దాద్ మైయా మొదటి సర్వ్‌లో 60శాతం విజయం సాధించగా, రెండో సర్వ్‌లో 56శాతం విజయం సాధించి, ఆమె 6/16 బ్రేక్ పాయింట్లను మార్చింది. 1968 US ఓపెన్‌, మరియా బ్యూనో తర్వాత, సెమీ-ఫైనల్‌కు చేరిన రెండవ బ్రెజిలియన్ మహిళా క్రీడాకారిణి హద్దాద్ మైయా రికార్డు సృష్టించింది.