
మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జూలై 19న నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మొదటి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్, బ్రిట్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలుపొందింది.
నాల్గో టెస్టు మ్యాచులో ఓ అరుదైన రికార్డును బెన్ స్టోక్స్ దగ్గరయ్యాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో 197 వికెట్లు తీసిన అతను.. 200 వికెట్లు తీయడానికి మరో 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.
ఒకవేళ బెన్ స్టోక్స్ ఆ ఫీట్ ను సాధిస్తే 200 వికెట్లు సాధించిన 17వ ఇంగ్లండ్ బౌలర్ గా అతను రికార్డుకెక్కనున్నాడు.
Details
బెన్ స్టోక్స్ సాధించిన రికార్డులివే
ఇప్పటివరకూ బెన్ స్టోక్స్ 95 టెస్టు మ్యాచుల్లో 6021 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలను బాదాడు. టెస్టుల్లో 6వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఇంగ్లండ్ మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
అతని కంటే ముందు జాక్వెస్ కలిస్ 13,289 పరుగులు, వికెట్లు, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 8,032 పరుగులు, 235 వికెట్లు తీసి బెన్ స్టోక్స్ కంటే ముందు స్థానంలో ఉన్నారు.
ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ 51.50 సగటుతో 309 పరుగులు చేశాడు. రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో 155 పరుగులు, మూడో టెస్టులో 80 పరుగులు చేశాడు.
22 యాషెస్ టెస్టుల్లో స్టోక్స్ 36.65 సగటుతో 1,466 పరుగులు, 41 వికెట్లను తీశాడు.