Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనా ఆస్ట్రేలియా జట్టు సారథి.. అధికారికంగా ప్రకటించిన బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్,మార్కస్ స్టాయినిస్ జట్టుకు దూరమవ్వగా, తాజాగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండం లేదు.
అతడితో పాటు, ఫాస్ట్ బౌలర్ జోష్ హెజెల్‌వుడ్ కూడా గాయంతో టోర్నీ నుండి తప్పుకున్నాడు.
ఈ విషయం క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గత నెలలో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
వివరాలు
ముగ్గురు ఆటగాళ్లు టోర్నీకి దూరం
ఈ జట్టులో కమిన్స్, హెజెల్‌వుడ్, మార్ష్ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే, వీరంతా గాయాలతో బాధపడుతున్నారని, వారు ఈ టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బైలీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, ఈ ముగ్గురు ఆటగాళ్లు టోర్నీకి దూరమవుతున్నారు.
'ఇది బాధాకర పరిణామమే అయినప్పటికీ, ఇతర ఆటగాళ్లకు గొప్ప అవకాశం లభించనుంది.వారు అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తమ ప్రతిభను ప్రదర్శించే సమయం వచ్చిందని' బైలీ పేర్కొన్నారు.
అలాగే,ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ నేడు వన్డేలను వీడుతున్నట్లు ప్రకటించాడు. దీంతో, అతడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడు .
వివరాలు
2023 వన్డే ప్రపంచకప్‌ను జట్టుకు కమిన్స్ కెప్టెన్
అయితే, ఆసీస్ జట్టులో స్టాయినిస్ పేరును ప్రకటించినప్పటికీ, బైలీ అతడిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
తాజా ప్రకటనతో, ఆసీస్ జట్టులో నాలుగు మార్పులు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ మార్పులపై ఫిబ్రవరి 12 లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
దీనితో, ఆసీస్ క్రికెట్‌లో ఈ మార్పులపై చర్చ మొదలైంది. కమిన్స్ లేకపోతే, ఆసీస్ జట్టు కెప్టెన్ పాత్ర ఎవరిదిగా మారుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
2023 వన్డే ప్రపంచకప్‌ను సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు కమిన్స్‌నే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.