IND Vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. గాయంతో కేన్ విలియమ్సన్ దూరం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో టెస్టు అక్టోబర్ 24న పుణెలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో కేన్‌కు గజ్జల్లో గాయమైంది. అతను త్వరగా కోలుకుంటాడని భావించి, భారత్ సిరీస్‌లో ఎంపిక చేశారు. కానీ జట్టుతో కలిసి భారత్‌కు రాలేదు. ప్రస్తుతం కేన్ స్వదేశంలోనే చికిత్స పొందుతున్నాడు. కేన్ విలియమ్సన్ పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నామని, అతడు వేగంగా కోలుకుంటున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.
న్యూజిలాండ్
ప్రస్తుతం కేన్ విలియమ్సన్ వంద శాతం ఫిట్‌గా లేడని, మరికొన్ని రోజుల్లో మూడో టెస్టుకు అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నామని వెల్లడించింది. మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. బెంగళూరు టెస్టులో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు మంచి ఊపుమీద ఉన్నారు. రెండో టెస్టులో కూడా అదే జోరు కొనసాగించేందుకు కివీస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోవైపు టీమిండియా, న్యూజిలాండ్ దూకుడుకు కళ్లెం వేసి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది