
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది.
తొలి టెస్టులో చోటు దక్కని టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు తొలి టెస్టులో చోటు దక్కలేదు.
అయితే రెండో టెస్టులో కూడా జట్టులో స్థానం దక్కే అవకాశం కనిపించడం లేదు.
తాజా సమాచారం ప్రకారం, సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ ఇరానీ ట్రోఫీ కోసం జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య పోటీ జరగనుంది.
సర్ఫరాజ్‌ను ముంబై జట్టులో చేర్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
Details
రాహుల్ రీ-ఎంట్రీతో సర్ఫరాజ్ ఔట్
భారత జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లకు ఎటువంటి గాయాలు లేకపోతే, సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా గాయపడినా, లక్నో నుండి కాన్పూర్‌కి సర్ఫరాజ్ సమయానికి చేరుకునే అవకాశముందని బీసీసీఐ భావిస్తోంది.
సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. మూడు టెస్టుల్లో హాఫ్ సెంచరీలు బాది తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
అయితే రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు లభించలేదు.
50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 66.39 సగటుతో 4183 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, భారత్ తరఫున 3 టెస్టుల్లో 200 పరుగులు చేశాడు.