Page Loader
ASIAN GAMES : భారత్కు బంగారు పతకం.. టెన్నిస్‌లో బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ
టెన్నిస్‌లో రోహన్‌ బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ

ASIAN GAMES : భారత్కు బంగారు పతకం.. టెన్నిస్‌లో బోపన్న, రుతుజ జోడీ సూపర్ విక్టరీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 30, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్ లో భారతదేశం మరో బంగారు పతకం సాధించింది. ఈ మేరకు టెన్నిస్ ఆటలో రోహన్ బోపన్న, రుతుజ భోసలే జోడీ సూపర్ విక్టరీ సాధించింది. ఈ క్రమంలోనే భారత అథ్లెట్లు ఆసియా క్రీడల్లో మరో స్వర్ణాన్ని తమ ఖాతాలో జమ చేసుకున్నారు. టెన్నిస్‌ మిక్స్‌డ్ డబుల్స్ లో బోపన్న - రుతుజ జోడీ బంగారు పతకాన్ని ఒడిసి పట్టింది. దీంతో ఆసియా క్రీడల్లోని టెన్నిస్ విభాగంలో భారతదేశం తొలి బంగారు పతకం సాధించినట్టైంది. రోహన్ బోపన్న - రుతుజ ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో 2-6, 6-3, 10-4తేడాతో గోల్డ్‌ మెడల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్‌ స్వర్ణ పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

9కి  చేరిన భారత స్వర్ణ పతకాల సంఖ్య