Page Loader
Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్
టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్ టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్

Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది. పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని సత్తా చాటారు. దక్షిణాకొరియాకు చెందిన సోనోన్‌వూ క్వాన్, సియోంచన్ హాంగ్‌లను ఓడించి వారు ఫైనల్ కు అర్హత సాధించారు. దీంతో స్వర్ణం సాధించడానికి దగ్గరయ్యారు. సెమీ ఫైనల్‌లో 6-1, 6-7, 10-0 తేడాతో సోనోన్‌వూ కా్వన్, సియోంచన్ హాంగ్ లపై రామ్ కుమార్, సాకేత్ విజయం సాధించారు. ఇక ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన 7వ భారత జోడీగా సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్ నిలిచారు.

Details

గోల్డ్ మెడల్ కు చేరువలో రామ్ కుమార్, సాకేత్

శుక్రవారం జరిగే పురుషుల డబుల్స్ ఫైనల్‌లో రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని థాయిలాండ్‌కు చెందిన ఇసారో ప్రుచ్యా, జోన్స్ మాగ్జిమస్ పారాపోల్‌తో తలపడనున్నారు. ఈ మ్యాచులో విజయం సాధిస్తే స్వర్ణాన్ని గెలిచే అవకాశం ఉంటుంది. మరోవైపు టాప్ సీడ్‌లు రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీ ఓటమి తర్వాత పురుషుల డబుల్స్ లో వీరిద్దరూ ఫైనల్‌కు చేరడం విశేషం.