
Rohit Sharma: రోహిత్‌ను వన్డే జట్టు నుంచి దూరం చేయడానికే బ్రాంక్ టెస్ట్ : భారత మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న యోయో టెస్ట్‌కు తోడుగా బ్రాంకో టెస్ట్‌ను కూడా బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. ఈ నిర్ణయం పై మాజీ క్రికెటర్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఆటగాళ్లకు పరిచయం చేశారు. అంటే, ఓ ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించాలంటే, యోయో టెస్ట్‌తో పాటు బ్రాంకో టెస్ట్‌లోనూ పాస్ కావాల్సి ఉంటుంది. అయితే.. టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఈ టెస్ట్‌ను ప్రవేశపెట్టిన నిజమైన ఉద్దేశ్యం రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించడం అని ఆరోపించారు.
Details
బ్రాంకో టెస్ట్ పాస్ కావడం కష్ట
'2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడడానికి ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. కానీ రోహిత్ శర్మకు బ్రాంకో టెస్ట్ పాస్ చేయడం కష్టమని నేను భావిస్తున్నా. ఈ టెస్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రోహిత్ శర్మను భవిష్యత్తులో వన్డే జట్టు నుంచి దూరం చేయాలనుకునే ఉద్దేశ్యమే ఉందని మనోజ్ తివారీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్రాంకో టెస్ట్ అత్యంత కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలలో ఒకటి. కొత్త హెడ్‌కోచ్ ఈ టెస్ట్‌ను ఎందుకు సిరీస్ ప్రారంభంలో అమలు చేయలేదు? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. రోహిత్ శర్మ ఈ పరీక్షను పాస్ చేయడం అతనికి అంత సులభం కాదని తివారీ వాపోయారు.
Details
బ్రాంకో టెస్ట్ వివరాలు
ఇది పరుగు పరీక్ష. ఎక్కువగా రగ్బీ ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. పరీక్షలో ఆటగాడు ఆరు నిమిషాల వ్యవధిలో విరామం లేకుండా 1200 మీటర్ల దూరం పరుగెత్తాలి. ఈ పరీక్ష ద్వారా ప్లేయర్ల శారీరక సామర్థ్యం, వేగం, మానసిక దృఢత్వం అంచనా వేయవచ్చు.