Page Loader
Rinku Singh: రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా 
రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా

Rinku Singh: రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2023
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL) 2023లో కోల్‌ కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడి మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టుకు విజయాలను అందించాడు. ప్రస్తుతం రింకూ సింగ్ (Rinku Singh) ఓ యువ సంచనలంగా మారాడు. మొదటగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు ఎంపికైన రింకూ సింగ్ భారీ షాట్లు కొడుతూ బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లోనూ రింకూ చెలరేగిపోతున్నాడు. . రింకు సింగ్ తన చివరి నాలుగు మ్యాచుల్లో 38, 37*, 22* 31* పరుగులు చేశాడు. అయితే రింకూ సింగ్‌పై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశిష్ నెహ్రా (Ashish Nehra) ప్రశంసల వర్షం కురిపించాడు.

Details

రింకూ సింగ్ కి వన్డేల్లో అవకాశం దక్కుతుంది

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఫినిషర్‌గా రింకూసింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడని, భారత జట్టుకు రింకూ ప్రధాన ఆస్తిగా అశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్‌కు కచ్చితంగా వన్డేల్లోనూ చోటు దక్కుతుందని ఆయన చెప్పారు. రింకూ సింగ్ బ్యాటింగ్ గురించి మాత్రమే కాదని, అతను మైదానంలో బాలు విసిరే విధానంతో కూడా బాగుందని, రేపు వన్డేల్లో కూడా ఫినిషర్ పాత్ర పోషించే సత్తా అతనికే ఉందన్నారు. రింకూ తన ఆటను మెరుగుపరుచుకుంటే నెంబర్ 4 లేదా 5లో ఆడగలడని వివరించాడు.