
Mumbai Indians: నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్.. హార్దిక్ సేన ముందున్న గండం ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్ (2025) ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ముంబయి ఇండియన్స్ పదిసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా నిలిచింది. ఈసారి 11వసారి కూడా ప్లేఆఫ్స్ బరిలోకి దిగింది. ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. మిగతా నాలుగు సార్లు మాత్రం ప్లేఆఫ్స్ వరకే పరిమితమైంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన గణాంకం ఉంది. ముంబయి ఇండియన్స్ టాప్-2 స్థానాల్లో నిలిచిన ఆరు సార్లలో, ఐదు సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. కేవలం ఒక్కసారి మాత్రమే రన్నరప్‌గా నిలిచింది. 2010 సీజన్ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గలేకపోయింది.
వివరాలు
టాప్-2లో ఉంటే విజయం దాదాపు ఖాయం!
లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్లు టాప్-2లో నిలిస్తే, టైటిల్‌కు చేరుకోవడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి. మొదటి క్వాలిఫయర్ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు వెళ్లొచ్చు. ఓడినా మరో అవకాశం లభిస్తుంది.. రెండో క్వాలిఫయర్‌లో గెలిస్తే ఫైనల్‌కు అడుగు పెట్టొచ్చు. అందుకే అన్ని జట్లు టాప్-2లో నిలవాలని భావిస్తాయి. ముంబయి కూడా టాప్-2లో ఉన్నప్పుడల్లా ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని, టైటిల్‌ను గెలుచుకుంది. ఉదాహరణకి, 2013, 2017 సీజన్లలో మొదటి క్వాలిఫయర్‌లో ఓడినా, రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్‌కి వెళ్లింది. అక్కడ విజేతగా అవతరించింది. మిగతా టైటిళ్లు అయిన 2015, 2019, 2020లలో ముంబయి టాప్-2లో నుంచే టైటిల్ సాధించింది.
వివరాలు
మూడో, నాలుగో స్థానాలు ముంబయికి కలిసిరాలేదు
మూడో లేదా నాలుగో స్థానాల్లో ప్లేఆఫ్స్‌కు చేరినప్పుడు ముంబయి ఎప్పుడూ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. రెండు సార్లు క్వాలిఫయర్-2కి చేరినా, అక్కడే ఆగిపోయింది. మిగిలిన రెండు సార్లు ఎలిమినేటర్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. 2011, 2012లో ముంబయి 3వ స్థానంలో ఉండగా; 2014, 2023లో 4వ స్థానంతో ప్లేఆఫ్స్‌కి చేరింది. కానీ ఈ నాలుగు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ప్రస్తుతం ముంబయి నాలుగో స్థానంలోనే ప్లేఆఫ్స్ బరిలోకి దిగుతోంది. ముంబయి అభిమానుల్ని కలవరపెట్టే అంశమిదే. అయినా కూడా, గతం చూసినపుడు - టైటిల్ రేసులో నిలవడం అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది.
వివరాలు
వరుస గెలుపులు
ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ముంబయి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సందర్భాల్లో టైటిల్‌ను గెలవకుండా పోయిన చరిత్ర లేదు. 2020 సీజన్ అందుకు మంచి ఉదాహరణ. ఆ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటే గెలిచిన ముంబయి, ఆ తర్వాత ఊపందుకుని చివరికి టైటిల్ కొట్టింది. అదే సీజన్ చివరిసారిగా ముంబయి ఛాంపియన్‌గా నిలిచింది. మళ్ళీ అలాంటి విజయం దిశగా ముంబయి ప్రయాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబయి ఐదు టైటిళ్లు సాధించింది. ఇప్పుడు హార్దిక్ పాండ్య ఎలాంటి మ్యాజిక్‌తో ముందుకు తీసుకెళ్తాడో చూడాలి..!