Page Loader
ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం
మెద్వెదేవ్‌ను ఓడించిన కార్లోస్ అల్కరాజ్

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన ప్రత్యర్థిని 6-3, 6-2 తేడాతో చిత్తు చేశాడు. 2017లో రోజర్ ఫెదరర్ తర్వాత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఇండియన్ వెల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆటగాడిగా అల్కరాజ్ చరిత్రకెక్కాడు. అల్కరాజ్ యుక్తవయసులో మూడు మాస్టర్స్‌లో 1000 టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటాడు. అల్కరాజ్ యుక్తవయసులో మూడు మాస్టర్స్‌లో 1000 టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటాడు. ATP ర్యాంకింగ్స్‌లో అంతకుముందు నంబర్ వన్ స్థానంలో ఉన్న సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ వెనక్కి నెట్టాడు.

కార్లోస్ అల్కరాజ్

కార్లోస్ అల్కరాజ్ సాధించిన రికార్డులివే

అల్కరాజ్ ప్రస్తుతం 7,420 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ వెల్స్‌లో విజయం సాధించిన తర్వాత అతను 640 పాయింట్లు సంపాదించాడు. జొకోవిచ్ 7,160 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మెద్వెదేవ్ 4,330 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఏప్రిల్ 2022లో అల్కరాజ్ మయామిలో తన తొలి ATP మాస్టర్స్ 1000 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్‌లో అతను 7-5, 6-4తో ఆరో సీడ్ కాస్పర్ రూడ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అల్కరాజ్‌కి ఇది మూడో ATP టైటిల్ కావడం విశేషం. 2017లో ఫెదరర్ తర్వాత ఒక సెట్ కోల్పోకుండా ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సాధించిన మొదటి వ్యక్తి అల్కరాజ్ రికార్డు సృష్టించాడు.