LOADING...
Test series: భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా? 
భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా?

Test series: భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. టీమిండియా సొంత గడ్డపై జైత్రయాత్ర సాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసి, వరుసగా 18 సిరీస్‌లను కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ సారధ్యంలోని జట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కూడా పూర్తి ఆధిపత్యంతో రాణిస్తోంది. భారత్‌ బ్యాటింగ్‌లో యువ బ్యాటర్లు సత్తా చాటుతూ ముందుకెళ్తున్నారు. శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్ పంత్‌ శతకాలు సాధించగా, యశస్వీ జైస్వాల్‌ మూడు అర్ధశతకాలు బాదాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ ఇంకా తమ ప్రతిభను పూర్తిగా చూపించకపోయినా, వారు ఎప్పుడు తిరిగి ఫామ్‌లోకి వస్తారనేది సమస్యగా మారింది.

Details

న్యూజిలాండ్ పై భారత్ కు తిరుగులేని రికార్డు

బౌలింగ్‌ విభాగంలో అశ్విన్‌, జడేజా స్పిన్‌తో రాణిస్తున్నారు. ఇక పేస్ విభాగంలో బుమ్రా అదరగొట్టారు. న్యూజిలాండ్‌ మాత్రం కష్టాల్లో ఉంది. ఇటీవల శ్రీలంక పర్యటనలో 0-2తో పరాభవం ఎదుర్కొన్న కివీస్‌, తాజాగా టీమిండియాతో టెస్టు సిరీస్ కి సిద్ధమవుతోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ సైతం ప్రథమ టెస్టుకు అందుబాటులో లేకపోవడం వారి పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది. కివీస్‌ బ్యాటర్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. భారత్‌ టెస్టు సిరీస్‌లలో న్యూజిలాండ్‌పై తిరుగులేని రికార్డును కలిగి ఉంది. ఇప్పటివరకు భారత్‌ సొంతగడ్డపై న్యూజిలాండ్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈ సారి కూడా అదే రీతిలో భారత్‌ తమ హవాను కొనసాగించవచ్చని అంచనాలు ఉన్నాయి.