
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. బ్యాటింగ్, బౌలింగ్ టాప్-5లో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.
టోర్నమెంట్ మొత్తం అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
12 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ దక్కించుకుంది.
ఎనిమిది జట్లు పోటీపడిన ఈ టోర్నీలో భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడి విజేతగా అవతరించింది.
Details
బ్యాటింగ్ విభాగంలో టాప్-5 ప్లేయర్లు
ఈ టోర్నీలో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేశాడు. 263 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కూడా టాప్-5 జాబితాలో చోటు సంపాదించారు.
టాప్-5 బ్యాటర్లు
1. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) - 4 మ్యాచ్‌లు, 263 పరుగులు, 2 సెంచరీలు, 65.75 యావరేజ్
2. శ్రేయస్ అయ్యర్ (భారత్) - 5 మ్యాచ్‌లు, 243 పరుగులు, 2 అర్ధ సెంచరీలు, 60.75 యావరేజ్
3. బెన్ డకెట్ (ఇంగ్లండ్) - 3 మ్యాచ్‌లు, 227 పరుగులు, 1 సెంచరీ, 75.66 యావరేజ్
Details
9 వికెట్లతో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి
4. జో రూట్ (ఇంగ్లండ్) - 3 మ్యాచ్‌లు, 225 పరుగులు, 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ, 75 యావరేజ్
5. విరాట్ కోహ్లీ (భారత్) - 5 మ్యాచ్‌లు, 218 పరుగులు, 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ, 54.50 యావరేజ్
బౌలింగ్ విభాగంలో టాప్-5 బౌలర్లు
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు.
Details
టాప్-5 బౌలర్లు
1. మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) - 4 మ్యాచ్‌లు, 10 వికెట్లు, 5.32 ఎకానమీ
2. వరుణ్ చక్రవర్తి (భారత్) - 3 మ్యాచ్‌లు, 9 వికెట్లు, 4.53 ఎకానమీ
3. మహమ్మద్ షమీ (భారత్) - 5 మ్యాచ్‌లు, 9 వికెట్లు, 5.68 ఎకానమీ
4. మిచెల్ శాంట్నర్ (న్యూజిలాండ్) - 5 మ్యాచ్‌లు, 9 వికెట్లు, 4.80 ఎకానమీ
5. మైకేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్) - 5 మ్యాచ్‌లు, 8 వికెట్లు, 4.10 ఎకానమీ
అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లు
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్) తొలి స్థానంలో ఉన్నారు. ఇద్దరూ తలా 8 సిక్స్‌లు బాదారు.