
CSK vs LSG: లక్నోను మట్టికరిపించిన చైన్నై.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా ఆటల్ బిహార్ వేదికగా జరిగిన మ్యాచులో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో సీఎస్కే 19.3 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది.
ఓపెనర్లు రచన్ రవీంద్ర (37: 22 బంతుల్లో 5 ఫోర్లు), రషీద్ (27: 19 బంతుల్లో ఆరు ఫోర్లు) రాణించారు.
చివర్లో శివం దూబే (43 : 37 బంతుల్లో మూడు ఫోర్, రెండు సిక్సర్లు), ఎంఎస్ ధోని (26: 11 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్) రాణించడంతో చైన్నై సునాయాసంగా విజయం సాధించింది.
Details
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ వృథా
చైన్నై బౌలర్లో రవీంద్ర జడేజా, పతిరణ తలా రెండు వికెట్లు, ఖలీల్ ఆహ్మద్, కంబోజ్ తలా ఓ వికెట్ తీశారు.
కెప్టెన్ రిషబ్ పంత్ 49 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 30 బంతుల్లో (2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
లక్నో బౌలర్లో రవి బిష్ణోయ్ 2, మార్క్రమ్, అవేశ్ ఖాన్, దిగ్విష్ తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదు వికెట్ల తేడాతో చైన్నై విజయం
Match 30. 18.6: Shardul Thakur to MS Dhoni 4 runs, Chennai Super Kings 161/5 https://t.co/jHrifBkT14 #LSGvCSK #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 14, 2025