Sreesanth: లెజెండ్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth) మధ్య గొడవ రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. తాజాగా లెజెండ్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్ కి నోటీసులు పంపింది. తనను ఫిక్సర్ అన్నాడంటూ సోషల్ మీడియా వేదికగా గంభీర్ ను విమర్శిస్తూ శ్రీశాంత్ పోస్టులు పెట్టడంతో మరింత అగ్గి రాజుకుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు పంపించింది. శ్రీశాంత్ తన కాంట్రాక్టును ఉల్లంఘించాడని ఆ నోటీసులో పేర్కొంది. ఇక శ్రీశాంత్ పోస్టు చేసిన వీడియోలను డిలీట్ చేస్తేనే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. దీనిపై అంపైర్లు కూడా తమ రిపోర్టును సమర్పించారు.
ఫిక్సర్ అని ఏడెమిదిసార్లు అన్నాడు : శ్రీశాంత్
ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో గంభీర్ తనను ఫిక్సర్ అని తిట్టాడి, అందుకనే అతడిని కోపంగా చూశానని శ్రీశాంత్ తెలిపారు. గంభీర్ అందరితోనూ గొడవ పడతాడని, తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఏడెమిదిసార్లు ఫిక్సర్ అన్నాడని శ్రీశాంత్ విమర్శించాడు. ప్రపంచమంతా అటెన్షన్‌గా ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలని అంటూ గంభీర్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఇక వీరద్దరి మధ్య గొడవ ఎంతదూరం వెళుతుందో వేచి చూడాలి. 2013 ఐపీఎల్ లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో సస్పెండ్ అయిన విషయం తెలిసిందే