Page Loader
Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ!
ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ!

Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన చిన్నపాటి ఉద్రిక్తత అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ ప్రారంభమైన టాస్ నుంచే ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లో తేడా స్పష్టంగా కనిపించింది. గిల్ ఔట్ అయిన తర్వాత హార్దిక్ తన భావోద్వేగాలను కాస్త ఆగ్రహంగా వ్యక్తపరిచిన తీరు, వారి మధ్య విభేదాలున్నాయేమోనన్న అనుమానాలకు దారితీసింది. అయితే ఈ అంశంపై గిల్ స్పందన అభిమానులకు ఉన్న సందేహాలను తొలగించింది. మ్యాచ్ అనంతరం గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'నథింగ్ బట్ లవ్' అంటూ హార్దిక్‌కు డెడికేట్ చేసిన పోస్టును షేర్ చేశాడు.

Details

ఇద్దరి మధ్య విబేధాలకు పుల్ స్టాప్

దీనిని హార్దిక్ పాండ్యా తన అకౌంట్‌లో పునఃప్రచురిస్తూ 'ఆల్వేస్ శుభూ బేబీ' అనే కామెంట్ పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవని స్పష్టమవుతోంది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ముంబై ఇండియన్స్ నేడు (జూన్ 1) అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు, జూన్ 3న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొననుంది.