Page Loader
వరుస డకౌట్లు.. అయినా అగ్రస్థానంలో సూర్య
అగ్రస్థానంలో సూర్యకుమార్ యాదవ్

వరుస డకౌట్లు.. అయినా అగ్రస్థానంలో సూర్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల చెత్త ప్రదర్శనతో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సూర్య వరుసగా 15, 1, 0 పరుగులు చేసి పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో 906 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (811 పాయింట్లు) ఉన్నాడు.

రషీద్ ఖాన్

బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ అగ్రస్థానం

అంతర్జాతీయ మ్యాచ్ లు జరగకపోవడం వల్లే సూర్యకుమార్ యాదవ్ నెంబర్ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో అప్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో ఫజల్లా ఫరుకీ, మూడో స్థానంలో జోష్ హాజిల్ వుడ్, నాలుగో స్థానంలో హసరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించలేదు.