Page Loader
IND w Vs AUS w: థర్డ్ అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా?
థర్డ్ అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా?

IND w Vs AUS w: థర్డ్ అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సెమీఫైనల్‌ అవకాశాలు క్లిష్టమయ్యాయి. ఈ ఓటమికి కారణంగా థర్డ్ అంపైర్‌ తీసుకున్న వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయమని నెటిజన్లు వాపోతున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ వేస్తున్న సమయంలో భారత బౌలర్‌ దీప్తి శర్మ రెండో బంతి విసిరినప్పుడు ఆసీస్ ప్లేయర్ లిట్చ్‌ఫీల్డ్‌ స్విచ్‌ షాట్‌ కొట్టడానికి ప్రయత్నించింది. బంతి ఆమెను హిట్‌ చేసినప్పుడు, భారత ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించినప్పటికీ, లిట్చ్‌ఫీల్డ్‌ డీఆర్‌ఎస్‌ తీసుకోగా, థర్డ్‌ అంపైర్‌ బంతి లెగ్‌ సైడ్ అవుట్‌సైడ్ అని తేల్చి నాటౌట్‌గా ప్రకటించారు.

Details

ఎల్బీడబ్ల్యూ నిబంధనలలో మార్పులు చేయాలి

అయితే, క్రికెట్ విశ్లేషకుల వాదన ప్రకారం, బ్యాటర్‌ తన స్థానం మారించినప్పుడు, 'అవుట్‌సైడ్‌ లెగ్‌' అనే నిబంధన వర్తించదని పేర్కొన్నారు. దీనిపై థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై విపరీతంగా విమర్శలొచ్చాయి. లిట్చ్‌ఫీల్డ్‌ కేవలం 5 పరుగుల వద్ద ఉండగా, ఆమె ఔటై ఉంటే ఆసీస్ స్కోరు 140 కూడా దాటేది కాదని అభిమానులు అభిప్రాయపడ్డారు. తదుపరి ఇన్నింగ్స్‌లో లిట్చ్‌ఫీల్డ్‌ 9 బంతుల్లో 15 పరుగులు చేసి, చివరి బంతికి సిక్స్‌ కొట్టడం గమనార్హం. దీంతో ఆసీస్ 151 పరుగులు చేసింది. ఐసీసీ ఈ నిబంధనలపై మళ్లీ సమీక్ష చేసి, రివర్స్‌ షాట్‌ సమయంలో ఎల్బీడబ్ల్యూ నిబంధనలలో మార్పులు చేయాలని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.