Page Loader
Duleep Trophy: దులీప్‌ ట్రోఫీలో భారీగా బెట్టింగ్‌.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌
దులీప్‌ ట్రోఫీలో భారీగా బెట్టింగ్‌.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌

Duleep Trophy: దులీప్‌ ట్రోఫీలో భారీగా బెట్టింగ్‌.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దులీప్ ట్రోఫీ సమయంలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లు అనంతపురం గ్రామీణ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అంతరాష్ట్ర బెట్టింగ్ ముఠాను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, మొత్తం 19 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 8.60 లక్షలు, 19 సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది కర్ణాటకకు చెందినవారు, 7 మంది హర్యానాకు చెందినవారని తెలిపారు.

వివరాలు 

యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా, లైవ్ మ్యాచ్‌లు చూసి బెట్టింగ్ నిర్వహించేవారని, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రతి ఓవర్, బాల్‌కు బెట్టింగ్ పెట్టేవారని పేర్కొన్నారు. దులీప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం పోలీసులు మొదటి రోజు నుంచే స్టేడియంపై నిఘా ఉంచి, యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఈ ముఠాను పట్టుకున్నారని వివరించారు.