Nasser Hussain: 2024లో రికార్డులను సృష్టించేది విరాట్ కోహ్లీనే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2023లో అద్భుత ఫామ్‌తో చెలరేగిపోయాడు. అసాధారణ రికార్డులు బద్దలుకొడుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు. పరుగుల వరద పారిస్తూ గతేడాది టీమిండియా(Team India)కు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. వన్డేల్లో 50 సెంచరీలు సాధించి సచిన్ (49) రికార్డును కోహ్లీని అధిగమించిన విషయం తెలిసిందే. అయితే 2024లో కూడా విరాట్ కోహ్లీ రికార్డులను సృష్టిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ (Nasser Hussain)పేర్కొన్నాడు. 2024లో రాణించే ఆటగాళ్ల గురించి చెప్పాలంటే తొలుత గుర్తుకొచ్చేది మెగాస్టార్ విరాట్ కోహ్లీనే అని, అందులో ఎలాంటి సందేహాము లేదన్నారు.
విరాట్ కోహ్లీపై నాజర్ హుస్సేన్ ప్రశంసలు
2023లో కోహ్లీ గొప్పగా ఆడారని, ప్రపంచ కప్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడని నాజర్ హుస్సేన్ కొనియాడారు. కోహ్లీ సాధించిన రికార్డులపై ఎక్కువ ఫోకస్ చేస్తూ, అతడు ఎంత గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడే విషయంపై దృష్టి సారించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీ ముంబయిలో శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్ సూపర్ గా ఉందన్నారు. విరాట్ మంచి ఫార్మ్ లో ఉన్నాడని హుస్సేన్ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. మరోవైపు పాకిస్థాన్ క్రికెటర్ బాబార్ అజామ్ పై కూడా నాజర్ హుస్సేన్ ప్రశంసల వర్షం కురిపించారు. గతేడాది పాకిస్థాన్ క్రికెట్ కోసం బాబార్ ఎంతో కృషి చేశారన్నారు.